‘జయ జయహే తెలంగాణ’ గీతం.. అవిష్కరణకు సిద్దం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణకు సిద్ధమైంది. మొత్తం 13 చరణాలతో కూడిన ఈ పాట 2 నిమిషాల 30 సెకన్లు ఉంటుందని సమాచారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ప్రజల ముందుకు జయ జయహే తెలంగాణ రాష్ట్రం గీతం రానుంది. ఈ సందర్బంగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన గాన బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. ఆత్మగౌరవాన్ని నలుమూలలా చాటిచెప్పేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ ఈ గీతం రాశారు. ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ గీతాన్ని ప్రజలు సులువుగా ఆలపించేలా కీరవాణి ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం.