పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దు.. సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓట్ల లెక్కింపురోజు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
పాల్వాయి గేటు టిడిపి పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లి కి హైకోర్టు ఇచ్చిన వెసులుబాటును ఎత్తి వేయాలని.. ఇవిఎం ధ్వంసంతో పాలు హత్యాయత్నం చేశారని, తనకు ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
మాచర్ల నియోజక వర్గంలోని రెంట చింతల పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఇవిఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇసి.. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీనిపై పిన్నెల్లి ముందస్తు బెయిల్‌కు వెళ్లారు. జూన్ 6వ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.