తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో మంట‌లు..

ఢిల్లీ (CLiC2NEWS): తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు బోగీల‌లో మంట‌లు చెల‌రేగాయి. ఆప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు హుటాహుటిన బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. ఆగ్నేయ ఢిల్లీలోని స‌రితా విహార్ వ‌ద్ద రైలులోని నాన్‌-ఎసి ఛైర్ కార్ డి3 కోచ్ నుండి అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. అనంత‌రం మంట‌లు మ‌రో రెండు బోగీల‌కు వ్యాపించిన‌ట్లు నార్త‌న్ రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శోభ‌న్ చౌధ‌రి వెల్ల‌డించారు. ఎనిమిది అగ్నిమాప‌క యంత్రాల‌తో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. డి3, డి4 కోచ్‌లు మంట‌ల్లో కాలిపోగా.. డి2 మాత్రం పాక్షికంగా కాలిన‌ట్లు స‌మాచారం. మంట‌లు చెల‌రేగ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.