అక్షరయోధుడు అస్తమయం
రామోజీరావు ఇకలేరు
హైదరాబాద్ (CLiC2NEWS): ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (88) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన మృతదేహాన్ని తరలించారు.
1936 నవంబర్ 16వ తేదీన ఎపిలోకి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. రైతు బిడ్డగా మొదలైన రామోజీరావు ప్రస్థానం వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా రంగంలో చెరగని ముద్రవేశారు.