మోడీతో మెగస్టార్, పవర్ స్టార్. విజువల్స్ వైరల్

విజయవాడ (CLiC2NEWS): భారీ సభలో ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ప్రమాణం చేశారు. బుధవారం విజయవాడ సమీపంలో జరిగిన భారీ సభలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. పవన్ ప్రమాణం చేస్తున్న సమయంలో.. కొణిదల పవన్ కల్యాణ్ అనే నేను.. అనగానే సభా వేదిక హోరెత్తిపోయింది. వేదిక మొత్తం దద్దరిల్లి పోయింది. ప్రమాణం అనంతరం పవన్ ప్రధాని మోడీ, గవర్నర్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేదికపైన ఉన్నవారికి నమస్కరించి.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం ప్రధాని మోడీ… మెగస్టార్ చిరంజీవి, తాజా ఎపి మంత్రి పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసి అభివాదం చేశారు. అన్నదమ్ములిద్దరని ప్రధాని మోడీ వేదికపై ఆలింగనం చేసుకున్న దృశ్యాలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. అనంతరం మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశాయి. ఈ దృశ్యాలు అక్కడున్న వారితో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కార్యక్రమంలో భాగంగా మంత్రులుగా నారా లోకేశ్, కించరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల, రామానాయుడు, ఎన్ ఎండి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్ధసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్ధన రెడ్డి, టిజి భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా అతిరథ మహారథులు హాజరయ్యారు.