16.347 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన చంద్రబాబు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. ముందుగా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. అదే విధంగా వరుసగా రెండోది లాండ్ టైటిలింగ్యాక్టు రద్దు, సామాజిక పింఛన్లు రూ. 4 వేలకు పెంపు మూడవది , నాల్గవది అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.
గురువారం సాయంత్రం సచివాలయం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్లో వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు సిఎం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్ననాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.