నాకు అభినందనలు తెలపడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలు తీసుకురావద్దు.. జనసేనాని

అమరావతి (CLiC2NEWS): జనసేనాని పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనను కలిసి అభినందనలు తెలిపేందుకు అటు సినిరంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సైతం క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలిస్తానని.. నన్ను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 20వ తేదీన పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేనాని 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలను, స్థానిక కార్యకర్తలను కలుస్తానన్నారు. ఆ తర్వాత దశల వారిగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.