ఎపిలో పింఛన్ల పెంపుపై ఉత్తర్వులు జారీ..

అమరావతి (CLiC2NEWS): పింఛన్ దారులకు శుభవార్త . ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు రూ. 4వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు . ఇది ఏప్రిల్ నెల నుండే అమలు చేస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ. వెయ్యి చొప్పున కలిపి జులై 1వ తేదీన రూ. 7వేలు పింఛన్ అందనుంది.
టిడిపి అధినేత చంద్రబాబు సిఎంగా బాధ్యతుల స్వీకరించిన అనంతరం మెగా డిఎస్‌సి, పింఛన్లపెంపు దస్త్రంపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపు కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల మానిఫెస్టోలో పించన్లు రూ. 3 వేల నుండి రూ. 4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ఫించన్ల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పింఛను పథకానికి 2014-2019 లో డిటిపి ప్రభుత్వం పెట్టిన పేరు ఎన్‌టిఆర్ భరోసా .. అదే పేరును ఇపుడు కూడా కొనసాగించనున్నారు. వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవి బాధితులు, కాళాకారులకు ఇక నుండి రూ. 4 వేలు అందనున్నాయి. ఇది ఏప్రిల్ నుండి అందుతుంది. అంటే వీరందరికి ఏప్రిల్, మే, జూన్ కలిపి జులై 1వ తేదీన రూ. 7 వేలు అందిస్తారు.