కువైట్ అగ్నిప్రమాదం.. కేరళకు 45 మంది భారతీయుల మృతదేహాలు

కొచ్చి (CLiC2NEWS): కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 భారతీయులు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృత దేహాలు శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాయి. వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్‌గోపి, బిజెపి రాష్ట్ర అద్యక్షడు కె సురేంద్రన్ విమానాశ్రయంలో ఉన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఉపాధి కోసం వెళ్లిన తమవారు విగతజీవులుగా తిరిగిరావడంతో ఆ ప్రాంత మంతా ఉద్విగ్నంగా మారిపోయింది.
కువైట్‌లోని అల్ మంగాఫ్ లో ఒ ఆపార్ట్‌మెంట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది కార్మికులు మృతి చెందారు. వారిలో 45 మంది భారతీయులే ఉన్నారు. మృతులలో 23 మంది కేరళకు చెందినవారు, ఏడుగురు తమిళనాడుకు.. ఎపి చెందిన వారు ముగ్గురు.. ఒక కర్ణాటక వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. దీంతో ఈ విమానం ఢిల్లీకి వెళుతుంది.
అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న భారత ప్రభుత్వం.. అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు, మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ సహాయక మంత్రి కీర్తి వర్దన్‌ను పంపించింది. బాధిత కుటుంబాలకు వ్యాపారవేత్తలు లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ రూ. 5 లక్షలు చొప్పున, రవి పిళ్లై రూ. 2 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలపినట్లు సమాచారం.