జొమాటో గిన్నిస్ రికార్డు..

Zomato:  ఒకే వేదిక‌పై భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌కు ఫ‌స్ట్ ఎయిడ్ శిక్ష‌ణ అందించి జొమాటో సంస్థ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ముంబయిలో నిర్వ‌హించిన‌ ఒకే వేదిక‌పై 4,300 మంది డెలివ‌రీ పార్ట్‌న‌ర్స్‌కు సిపిఆర్ శిక్ష‌ణ అందించి ఈ రికార్డు కైవ‌సం చేసుకున్న‌ట్లు జొమాటో సిఇఒ దీపింద‌ర్ గోయ‌ల్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం జొమాటోలో 30,000 కంటే ఎక్కువ డెలివ‌రీ భాగ‌స్వాములు వైద్యం అందించ‌డానికి, రోడ్‌సైడ్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో సాయం అందించ‌డానికి వృత్తిప‌రంగా శిక్ష‌ణ పొందిన‌ట్లు గోయ‌ల్ ‘ఎక్స్’ వేదిక‌గా పేర్కొన్నారు. ఈ శిక్ష‌ణ తీసుకున్న వారి బ్యాగ్‌పై గ్రీన్ క‌ల‌ర్ ‘ +’ సింబ‌ల్ ఉంటుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.