గంగానదిలో పడవ బోల్తాపడి ఆరుగురు గల్లంతు..

పట్నా (CLiC2NEWS): బిహార్లోని బాడ్ జిల్లాలో పడవప్రమాదం జరిగింది. ఉమానాథ్ ఘాట్ నుండి దియారాకు గంగానదిలో 17 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతయినట్లు సమాచారం. పర్యాటకులంతా దాదాపు ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. వీరిలో కొందరు ఈదుకుంటూ బయటకు రాగా.. ఆరుగురు జాడ కనిపించలేదు. సహాక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.