DRT అడ్వకేట్స్ అసోసియేషన్ లైబ్రరీని ప్రారంబించిన హైకోర్టు జడ్జి లక్ష్మీ నారాయణ
హైదరాబాద్ (CLiC2NEWS): డిఆర్టి (డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్) అడ్వకేట్స్ అసోసియేషన్ లైబ్రరీని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మి నారాయణ అలిశెట్టి ప్రారంభించారు. DRT -1 ప్రిసైడింగ్ అధికారి గుమ్మడి గోపీచంద్, DRT -2 ప్రిసైడింగ్ అధికారి రామేశ్వర్ గంగారామ్ కోతె సమక్షంలో సోమవారం కి.శే అనిల్ కుమార్ మెమోరియల్ లైబ్రరీ, లేడీ అడ్వకేట్స్ రూమ్‌ను హైకోర్టు జడ్జి ప్రారంభించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మి నారాయణ అలిశెట్టి ప్రసంగించారు. లాయర్లకు లైబ్రరీ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. జూనియర్ లాయర్లకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం DRT -1 ప్రిసైడింగ్ అధికారి గుమ్మడి గోపీచంద్, DRT -2 ప్రిసైడింగ్ అధికారి రామేశ్వర్ గంగారామ్ కోతె, అసోసియే షన్ ప్రెసిడెంట్ జికె దేశ్‌పాండే తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ జికె దేశ్‌పాండే, వైస్ ప్రెసిడెంట్ ఎన్ వి సుబ్బరాజు, జనరల్ సెక్రటరీ డి. రాఘవులు, జాయింట్ సెక్రెటరి కె. కల్యాణ్ చక్రవర్తి, ట్రెజరర్ అదిరన్ కిరణ్ రాజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ సిహెచ్ కిషోర్, లైబ్రేరియన్ టి రణ్‌దీర్ సింగ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ (మేల్) ఎ. నరేష్, జె. నరేంద్ర కుమార్, శ్రవణ్ కుమార్ రాగి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ (ఫిమేల్) జి పుష్కల, పి రాజేశ్వరి, పలువురు సీనియర్, జూనియర్ లాయర్లు పాల్గొన్నారు.