కంగారుల జట్టును ఓడించి సెమీస్‌లోకి భారత్ ..
T20 World Cup: టి20 ప్రపంచకప్ లో భారత్ విజయాలతో దూసుకుపోతుంది. చిరకాల ప్రత్యర్థి కంగారుల జట్టును 24 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 5 వికెట్ట నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ 92 , సూర్యకుమార్ 31, దూబె 287, పాండ్య 27*, పరుగులతో రాణించారు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన అస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 181 పరుగులే చేసింది. హెడ్ 76, మార్ష్ 37 పరుగులతో రాణించారు. గత మ్యాచ్‌లో ఆప్ఘాన్ చేతిలో ఓటమి పాలైన కంగారుల జట్టు టీమ్ ఇండియాను కంగారుపెట్టింది. 11 ఓవర్లకే ఆసీస్ స్కోరు 116 పరుగులకు చేరింది. హెడ్‌ను బుమ్రా ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. అర్షదీప్ .. వేడ్, డేవిడ్‌లను ఔట్‌చేశాడు. కులదప్ మ్యాక్సీని బౌల్డ్ చేశాడు. జట్టు సమన్వయంతో 24 పరుగుల తేడాతో గెలుపు సాధ్యమైందిం.
సెమీఫైనల్లో భారత్ , ఇంగ్లాండ్ జట్టులు తలపడనున్నాయి. మరోవైపు ఆసీస్ గెలిచి.. సూపర్-8లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆఫ్గానిస్తాన్ సెమీస్‌కు దూసుకుపోయింది. దీంతొ ఆప్గాన్ తొలిసారి టి 20 సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టాయి.