Kalki 2898 AD: ఎపిలో ఆరో షోకు గ్రీన్ సిగ్నల్

అమరావతి (CLiC2NEWS): ‘కల్కి 2898 ఎడి’ చిత్రం గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఎపిలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా రోజులకు ఐదు షోలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా రేపు (గురువారం) ఒక్కరోజు మాత్రమే ఆరో షోకు అనుమతినిచ్చింది.
మరోవైపు తెలంగాణలో సైతం టికెట్ ధరల పెంపుకు.. వారం పాటు ఐదు రోజులు పాటు ఐదు షోలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. గురువారం మాత్రం ఉదయం 5.30 గంటల షోకు అనుమతినిచ్చింది.