పల్నాడు జిల్లా వినుకొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

వినుకొండ (CLiC2NEWS): వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద అనంతపురుం-గుంటూరు జాతీయ రాహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. కర్ణాటకలోని బళ్లారి నుండి గుంటూరు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. మరణించిన వారు గుంటూరు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతదేహానలు పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.