టి20 ప్రపంచకప్ సెమీస్-1: ఆఫ్గాన్‌పై దక్షిణాప్రికా విజయం

T20 World Cup: టి20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఆఫ్గాన్, దక్షిణాఫ్రికా జట్టులు తలపడ్డాయి. ట్రినిడాడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్-1 మ్యాచ్‌లో ఆప్గనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. కానీ కేవలం 56 పరుగులకే ఆలౌటయింది. 57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన ఆఫ్గాన్ ఈ మ్యాచ్‌లో విఫలమైంది. దీంతో టి 20 చరిత్రలో దక్షిణాప్రికా తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
గురువారం రాత్రి 8 గంటలకు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.
కంగారుల జట్టును ఓడించి సెమీస్‌లోకి భారత్ ..