అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి: డిప్యూటి సిఎం

విజయవాడ (CLiC2NEWS): రామోజీరావును మొదటిసారి కలిసినపుడు ఆయన మాట్లాడే విధానం తనను ఆకర్షించిందని డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ అన్నారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ రామోజి రావు కుటుంబసభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రజా సంక్షేమం కోణంలోనే ఎపుడూ మాట్లాడేవారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానిక ఆయన రాజీలేని పోరటం చేశారని.. ఆయన మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన వివరించారని, ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనేవారని తెలిపారు. ఏ పార్టీ అధికారంల ఉన్న ప్రజా సమస్యల గురించే పత్రికలో రేసేవారని.. ఎన్నికష్టాలు వచ్చిన జర్నలిజం విలువలు వదల్లేదన్నారు. అమరాతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్‌కల్యాణ్ సూచించారు.