ప్రధాని మోడీని కలిసిన రాధిక-శరత్ కుమార్..

ఢిల్లీ (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రముఖ నటులు రాధిక-శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె , నటి వరలక్ష్మి వివాహానికి మోడీని ఆహ్వానించినట్లు సమాచారం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకోసం ఇప్పటి నుండే పనిచేయడ మొదలు పెట్టాలని మోడీ తెలిపారని రాధిక మీడియా సంస్థకు వెల్లడించారు.
నటి వరలక్ష్మి ప్రముఖ గ్యాలరిస్ట్ కికోలయ్ సచ్‌దేవ్‌తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖు సినీ రాజకీయ ప్రముఖులకు రాధిక-శరత్‌కుమార్, వరలక్ష్మి స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాధిక బిజెపి టికెట్‌పై పోటీ చేశారు. కానీ ప్రత్యర్థి మాణిక్కం ఠాగూర్ విజయం సాధించారు. రాధిక 2006లో రాజకీయ తెరంగేట్రం చేశారు. భర్త శరత్‌కుమార్‌తో కలిపి అన్నడిఎంకె లో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారిని పార్టీ నుండి తొలగించారు. 2007లో ఆల్ ఇండియ సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు.