ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణ : మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అధ్భుతంగా విజయవంతం కాబోతోంది. ఈ వాహనాలకు హబ్‌గా తెలంగాణను మార్చబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిసి శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఎలక్ట్రిట్ వాహనాల విస్తృతి సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సులో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర, నీతి ఆయోగ్ సిఇవో అమితాబ్ కాంత్ సదస్సులో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. 2020-2030 వరకు ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. ఐదు కంపెనీలతో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాలుష్యం లేని వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. డీ కార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీ సెంట్రలైజేషన్ అమలు చేయాలని సూచించారు. మరి కొన్నేళ్లలోనే రాష్ర్టంలోని జనాభా గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటుందన్నారు. రాష్ర్ట జీఎస్‌డీపీలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుందని పేర్కొన్నారు. మన వద్ద పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఎలక్ర్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అందుబాటులో భూములు ఉన్నాయని తెలిపారు. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్‌ను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వాహనాల తయారీ, నిర్వహణకు కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లో తెలంగాణ 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కెటిఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను భవిష్యత్‌లో మరింత పెంచేందుకు కృషి చేస్తామని కెటిఆర్ వివరించారు.
Ministers @KTRTRS and @puvvada_ajay unveiled the Telangana Electric Vehicle and Energy Storage Policy 2020-2030 at Telangana Electric Vehicle Summit in Hyderabad. Principal Secretaries @jayesh_ranjan and Sunil Sharma also participated. pic.twitter.com/z1plOe3o6I
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 30, 2020