విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..

ICC Titles:

2024 టి 20 ప్ర‌పంచ‌క‌ప్‌తో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. నాలుగు ఐసిసి టైటిల్స్ అందుకున్న రెండో భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. విరాట్ కంటే ముందు మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ నాలుగు ఐసిసి టైటిల్స్‌ను సాధించారు. 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత భార‌త్ ఐసిసి టైటిల్‌ను అందుకోవ‌డం ఇదే మొద‌టిసారి . మ‌హేంద్ర సింగ్ ధోని మూడు టైటిల్స్‌ను అందుకున్నాడు. 2007 టి 20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీల‌ను అందుకున్నాడు.

విరాట్ అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2008, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2011, ఐసిసి ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2013, టి20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ల‌లో అందుకున్నాడు.

యువ‌రాజ్ అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2000, ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2002, టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2007, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ల‌ను అందుకున్నాడు.

2 Comments
  1. […] విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. […]

Leave A Reply

Your email address will not be published.