ఎపి టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

అమరావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 16వేల పోస్టుల‌తో మెగా డిఎస్‌సి నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో పాఠ‌శాల విద్యాశాఖ అధికారులు సోమ‌వారం  టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. డిఎస్‌సికి సంబంధించిన ప్రత్యేక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వారం విడుద‌ల చేయ‌నున్నారు . టెట్ ప‌రీక్ష‌ల‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చని అధికారులు సూచించారు.

1 Comment
  1. […] ఎపి టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌ […]

Leave A Reply

Your email address will not be published.