చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఇదే మా కండీష‌న్: సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సినిమా థియేట‌ర్ల‌లో సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు సంబంధించిన విడియో ప్ర‌ద‌ర్శించాలి. అలా ప్ర‌ద‌ర్శించిన థియేట‌ర్ల‌కే భ‌విష్య‌త్తులో అనుమ‌తులు జారీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో టిజిన్యాబ్‌, సైబ‌ర్ సెక్యూరిటి బ్యూరో వాహ‌నాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. డ్ర‌గ్స్ వ్య‌తిరేక దినోత్స‌వం రోజు సినీన‌టుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సిఎం రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. స‌మాజం నుండి ఎంతో తీసుకుంటున్న‌వాళ్లు స‌మాజానికి కొంతైనా చేయాల‌న్నారు. కొత్త సినిమా విడుద‌లైన‌పుడు టికెట్ రేట్లు పెంచుకోవాడినికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాళ్లు .. ఆ సినిమాలోని స్టార్స్‌తో డ్ర‌గ్స్‌, సైబ‌ర్ క్రైమ్ నియంత్ర‌కు సంబంధించిన వీడియో రూపొందించాలి. ఇది ఖ‌చ్చిత‌మైన ష‌ర‌తు అన్నారు. ఒక‌ట్రెంటు నిమిషాల నిడివి గ‌ల వీడియో విజువ‌ల్స్ తీసుక‌స్తేనే వాళ్ల‌కు వెసులుబాటు, రాయితీలు ఇస్తామ‌న్నారు. సినిమా కోసం వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టి, టికెట్ రేట్లు పెంచి సంపాదించుకునే ఆలోచ‌న మంచిదే. ఇది వ్యాపారం , కానీ సామాజిక బాధ్య‌త కూడా అవ‌స‌ర‌మ‌ని సిఎం అన్నారు. ఈ స‌మాజాన్ని కాపాడాల్సిన బాధ్య‌త చిత్ర ప‌రిశ్ర‌మ మీద కూడా ఉంద‌ని అన్నారు. ప్ర‌భుత్వం నుండి స‌హ‌కారం కోరే వారు స‌మాజానికి స‌హ‌క‌రించాల‌ని.. ఇదే మా కండీష‌న్ అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.