ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తున్నా: రిషి సునాక్‌

లండ‌న్‌ : బ్రిట‌న్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో లేబ‌ర్ పార్టి విజ‌యం సాధించింది. క‌న్జ‌ర్వేటివ్ పార్టి ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. దీంతో పార్టి నేత , ప్ర‌ధాని రుషి సునాక్ ఓట‌మిని అంగీక‌రించారు. కాగా, సునాక్ మ‌రో ద‌ఫా ఎంపిగా విజ‌యం సాధించారు. మొత్తం 650 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు లేబ‌ర్ పార్టి మెజార్టి మార్కును దాటి 400 దిశ‌గా ప‌య‌నిస్తోంది. క‌న్జ‌ర్వేటివ్ పార్టి 80 స్థానాలు దాటిన‌ట్టు స‌మాచారం.

ఎన్నిక‌ల్లో క‌న్జ‌ర్వేటివ్‌ పార్టి పార‌జ‌యం పాలైనందుకు రిషి సునాక్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న సొంత నియ‌జ‌క‌వ‌ర్గం రిచ్‌మండ్ ఆండ్ నార్త‌ర్న్ అల‌ర్ట‌న్‌లోని పార్టి మ‌ద్ద‌తుదారుల్ని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారిని క్ష‌మించ‌మ‌ని కోరారు. గ‌త 14 ఏళ్లుగా బ్రిట‌న్లో క‌న్జ‌ర్వేటివ్ పార్టి అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి సునాక్ ప్రధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలింసిందే.

Leave A Reply

Your email address will not be published.