భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖలో 25 పోస్టులు

REC PDCL: డిప్యూటి మేనేజర్ , ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ ఈసి పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ( ఆర్ఇసి పిడిసిఎల్) దరఖాస్తులు కోరుతుంది.
గ్రాడ్యుయేట్ బిఇ, బిటెక్, ఎంబిఎ, సిఎ, సిఎంఎ, ఎంసిఎ, ఎంటెక్, ఎంసిఎస్, ఐటి, లా పిజిడిఎం, పిజిడితో పాటు ఐదేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. డిప్యూటి మేనేజర్ పోస్టులకు 39 ఏళ్లు.. ఆఫీసర్ పోస్టులకు 33 ఏళ్లు మించకూడదు. డిప్యూటి మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ. 13.5 లక్షలు.. ఆఫీసర్ పోస్టులకు ఏడాదికి రూ. 9 లక్షల వార్షిక వేతనం అందుతుంది. అభ్యర్థులను రాతపరీక్ష / ఇంటర్వూల ఆధారంగా ఎంపిక చేస్తారు. జులై 25 లోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది.