టీమ్ ఇండియాకు రూ.11 కోట్ల ప్రైజ్ మ‌నీ: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

టి20 ప్ర‌పంచ‌క‌ప్ లో విజ‌యం సాధించి టీమ్ ఇండియాకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం టీమ్ ఇండియాకు రూ. 11 కోట్ల ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించింది. భార‌త్‌కు చేరుకున్న టి20 విజేత‌ల‌కు ఘ‌న స్వాగతం ల‌భించింది. ప్ర‌ధాని మోడీ టీమ్ ఇండియా క్రికెట‌ర్ల‌ను పేరుపేరున అభినందించారు. అనంత‌రం ముంబ‌యి చేరుకున్న క్రికెట‌ర్ల‌కు జ‌న‌సంద్రంలా అభిమానులు భారీ ర్యాలీ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం టీమ్ ఇండియాకు రూ. 11 కోట్ల ప్రైజ్‌మ‌నీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ శిండే శుక్ర‌వారం ప్ర‌టించారు. ఇప్ప‌టికే ఐసిసి ఇచ్చిన రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీతో పాటు బిసిసిఐ భార‌త దేశ ఖ్యాతిని నిల‌బెట్టిన టీమ్ ఇండియా ఆట‌గాళ్ల‌కు రూ.125 కోట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు తాజాగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 11 కోట్లు ప్ర‌క‌టించింది.

BCCI: టీమ్ ఇండియాకు రూ. 125 కోట్ల బ‌హుమ‌తి

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..

Leave A Reply

Your email address will not be published.