సిబిఐకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రైల్వే అధికారులు..

గుంతకల్లు (CLiC2NEWS): గతిశక్తి పథకంలో భాగంగా రైల్వే లైన్ల అభివృద్దికి జరుగుతున్న పనుల్లో గుత్తేదారుల నుండి లంచం తీసుకుంటూ పలువురు అధికారులు సిబిఐకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గుంతకల్లు డివిజన్‌లోరూ. 500 కోట్లతో గతిశక్తి పథకంలో రైల్వే వంతెనల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు చేస్తున్న గుత్తేదారుల నుండి గుంతకల్లు రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారులు భారీగా లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాక.. స్టార్ హోటళ్లలో విలాసవంతమైన గదులు, భారీ పార్టీలకు కాంట్రాక్టర్లతో ఖర్చు పెట్టిస్తూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీలేరు గుత్తేదారు, జమ్మల మడుగుకు చెందిన మరో రైల్వే కాంట్రాక్టర్.. సిబిఐని ఆశ్రయించారు. మూడు రోజులపాటు గుంతకల్లు డిఆర్ ఎం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనంతరం డిఆర్ ఎం వినీత్ సింగ్, డిఎఫ్ ఎం ప్రదీప్ బాబు, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ అక్కిరెడ్డి , రైల్వే ఎస్ ఇ బాలాజి, అకౌంట్ అసిస్టెంట్ లక్ష్మిపతిరాజులను సిబిఐ అదుపులోకి తీసుకుంది.