గోవాలోని పాలి జలపాతంలో చిక్కుకున్న 80 మంది టూరిస్టులు

పనాజి (CLiC2NEWS): గోవాలోని పాలి జలపాతానికి ఆదివారం భారీ సంఖ్యలో టూరిస్టులు వచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో చేరుకున్నారు. భారీ వర్షాల కారణంగా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో దాదాపు 80 మంది పర్యాటకులు వరదలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్నసహాయక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదులు, జలపాతాలన్ని పరవళ్లు తొక్కుతున్నాయి. వాటి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారు. సెలవు రోజుల్లో జలపాతాల వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదాలలో కూడా చిక్కుకుంటుంన్నారు.