నగరంలో అర్‌టిసి బస్సు బీభత్సం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని సూరారాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. జీడిమెట్ల డిపోకి చెందిన బస్సు గండి మైసమ్మ నుండి సికింద్రాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆదివారం సాయంత్రం బహదూర్‌పల్లి చౌరస్తా నుండి సూరారం వరకు ట్రాఫిక్‌జామ్ అయింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారంణంగా ప్రయాణికులందరూ భయబ్రాంతులకు గురయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు గాయాలైయ్యాయి.