పుతిన్‌తో భారత ప్రధాని మోడీ భేటి

మాస్కో(CLiC2NEWS): రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక అంశాలను పుతిన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ పై కొనసాగుతున్న దాడులు గురించి మాట్లాడినట్లు సమాచారం. బాంబులు, బుల్లెట్టు మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని .. చర్చల ద్వారానే శాంతి మార్గం అనుసరించాల్సి ఉంటుందని మోడీ పేర్కొన్నారు. శాంతి స్తాపనకు భారత్ అన్ని వేళలా సిద్దంగా ఉంటుందని తెలిపారు.
ఇరుదేశాల ప్రతినిధులు గోల్ఫ్‌కార్ట్‌లో అధికార నివాసానికి వెళ్లటం , అధ్యక్షుడు పుతిన్ వెంటే ఉండి , అధికారిక నివాసానికి తీసుకెళ్లడం సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. గోల్ఫ్ కార్ట్ లో మోడీ పక్కన కూర్చున్న పుతిన్ స్వయంగా నడిపారు. వెనుక సీటులో ఇరు దేశాల దౌత్యవేత్తలు కూర్చున్నారు. అనంతరం ఇద్దరు ప్రతినిధులు ఇంటి టెర్రస్‌పై కూర్చుని ఇద్దరు ముచ్చటించారు.
ఉక్రెయిన్‌పై దాడులు జరుపుతున్న మాస్కో సైన్యంలో భారతీయులు అనూహ్య పరిస్తితులలో ఇరుక్కుపోయారు. సైన్యానికి సహాయకులుగా 30-40 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు సమాచారం. పుతిన్‌తో భేటీ లో ఈ విషయం ప్రస్తావించారు. వారిని వదిలిపెట్టేందుకు రష్యా అధినేత అంగీకరించినట్లు సమాచారం.
మరోవైపు రష్యా సైనికులు ఉక్రెయిన్‌పై సోమవారం దాడులు జరిపింది. ఈ దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు సహా 170 మంది గాయపడ్డారు. వారంతా చికిత్స పొందుతున్న ఆస్పత్రిపై కూడా మాస్కో సైనిక క్షిపణి దాడి చేసింది. శిథిలాల కింద అనేక మంది సమాధి అయినట్లు సమాచారం. మోడీ రష్యా పర్యటనలో ఉండగానే మాస్కో ఉక్రెయిన్‌పై క్షిపణి దాడి జరగటం.. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్మ దేశానికి చెందిన నాయకుడు .. ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడిని ఆలింగనం చేసుకున్నారు. వారిద్ధిరి భేటీ తమను నిరాశపరిచిందని.. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదని ఎక్స్ వేదికగా తెలిపారు.