మహిళా టి20: దక్షిణాఫ్రికాపై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం

చెన్నై (CLiC2NEWS): మహిళల టి20 మూడో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టి20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మూడో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. 85 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా అధిగమించింది. కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఈ సిరీసీ 1-1 తో సమమైంది.