హస్తం గూటికి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ పాటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహిపాల్ రెడ్డి 2014 నుండి వరుసగా మూడుసార్లు బిఆర్ఎస్ నుండి గెలుపొందారు. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు జహీరాబాద్ బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి గాలి అనిల్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలేరు యాదయ్య, దానం నగేందర్ సంజయ్, కృష్ణ మోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా మరికొందరు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం.