అనుమానాస్పద స్థితిలో 13 ఏళ్ల బాలిక మృతి

చేబ్రోలు (CLiC2NEWS): గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డిపాలెంకు చెందిన 13 ఏళ్ల బాలిక ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాలకు వెళ్లిన తమ కుమార్తె ఇంటికి రాకపోయే సరికి తల్లి , అన్నయ్య కలిసి గ్రామ మంతా వెతికారు. ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద తన చెల్లిలి చెప్పులు కనిపించాయని, ఆ బాలిక అన్న గుర్తించాడు. కిటికీలోంచి ఇంటి లోపలికి చూడగా.. తన చెల్లెలు విగతజీవిగా మంచంపై కనిపించింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిపగా.. వారు ఇంటి తాళం పగలగొట్టి , బాలికను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. కానీ.. బాలిక అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఆస్పత్రి వద్దనే బంధువులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం.