బంధువుల దుష్ప్రచారం త‌ట్టుకోలేకపోతున్నామని యువ దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

నిజామాబాద్ (CLiC2NEWS): బంధువులు త‌మపై చేస్తున్న దుష్ప్రచారాన్ని భ‌రించ‌లేక ఓ యువ దంప‌తులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పొతంగ‌ల్ మండ‌లం హెగ్డోలి చెందిన‌ అనిల్ , శైల‌జ దంప‌తులు సోమ‌వారం రాత్రి రైలు కింద ప‌డి ఆత్మ హ‌త్య చేసుకున్నారు. వారు అంత‌కుముందు త‌మ ఆవేద‌న‌ను తెల‌య‌జేస్తూ ఓ వీడియో తీసి పోలీసుల‌కు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది.

దంప‌తులిద్ద‌రూ ఇంట‌ర్వూకు వెళుతున్న‌ట్లు ఇంటివ‌ద్ద చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం శైల‌జ వీడియో చిత్రీక‌రించింది. తాను ఓ త‌ప్పు చేశాన‌ని, దాన్ని భ‌ర్త క్ష‌మించినా బంధువుల త‌మ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, దానిని భ‌రించ‌లేక‌పోత‌న్నామ‌ని, అందుకే ఇద్ద‌రం గోదావ‌రిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆ వీడియోలో పేర్కొన్ఆరు. ఆ వీడియోను పోలీసుల‌కు పంపారు. పోలీసులు గోదావ‌రి వ‌ద్ద‌కు వెళ్లి గాలించ‌గా క‌నిపించ‌లేదు. అనంత‌రం బాధితుల ఫోన్ నంబ‌ర్ ట్రాక్ చేసి నిజామాబాద్ జిల్లా నవీపేట మండ‌లం ఫ‌కీరాబాద్-మిట్టాపూర్ మ‌ధ్య ఉన్న‌ట్లు గుర్తించారు. అక్క‌డికి వెళ్లే లోపే వారి మృత‌దేహాలు ప‌ట్టాల‌పై క‌నిపించాయి.

Leave A Reply

Your email address will not be published.