AP: విద్యాదీవెన స్థానంలో పాత విధానం అమ‌లు: మంత్రి లోకేశ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): గ‌త ప్ర‌భుత్వ విధానాల‌తో రాష్ట్రంలోని విద్యార్థుల భ‌విష్య‌త్తు అగమ్య‌గోచ‌రంగా మారింద‌ని విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ విమ‌ర్శించారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన స్థానంలో పాత విధానం అమ‌లు చేస్తామ‌న్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఉన్న‌త విద్య‌పై ఆయ‌న అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఫీజు రియంబ‌ర్స్‌మెంట్‌కు విధివిధానాలు త‌యారు చేయాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాక లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి క‌స‌రత్తు చేప‌ట్టాల‌ని అన్నారు. పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌తిభ ఆధారంగా 3 వేల లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ జ‌ర‌గాల‌న్నారు. ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాలు త‌గ్గ‌డంపై మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.