రాష్ట్రంలో 2,640 బిటెక్ అదనపు సీట్లు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 2,640 బిటెక్ అదనపు సీట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 1,848 సీట్లు కౌన్సెలింగ్‌లోకి పరిధిలోకి రానున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్ నాటికి కన్వీనర్ కోటా కింది 70,307 సీట్లుండగా.. ఇపుడు 72,741 కి పెరిగాయి. కన్వీనర్, బి కేటగిరి కలిపి 98,296 ఉంటే.. ఇపుడు వాటి సంఖ్‌య 1,01,661 కి పెరిగాయి. కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత రెండు కాలేజీలు చేర్చడంతో అధనంగా 725 సీట్లు పెరిగాయి. తాజాగా ప్రభుత్వం 2,640 సీట్లకు అనుమతివ్వడంతో మొత్తం సీట్లు 3,365 కి పెరిగాయి. బిటెక్‌లో ప్రవేశాలకు నిర్ణయించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారంతో ముగుస్తుంది. కొత్తగా సీట్లు పెరగడం.. మరికొన్ని కాలేజీలలో కొత్త కోర్సులు రావడంతో ఇప్పటికే వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన విద్యార్థులు మార్చుకోవాల్సి ఉంటుంది. గడవు ఈ రోజుతో ముగియనుండటంతో అవగాహన లేని వారు నష్టపోతారేమోనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.