Suruapet: క్వారీ చూసేందుకు వెళ్లి.. ముగ్గురు మృతి

సూర్యాపేట (CLiC2NEWS): జిల్లాలోని ఆత్మకూరు మండలం బొప్పారంలో క్వారీ చూసేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. బిల్డర్‌గా పనిచేస్తున్న శ్రీపాల్ రెడ్డి, సాప్ట్వేర్ ఇంజినీర్ అయిన రాజు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. శ్రీపాల్ రెడ్డి, రాజు , ఆయన కుమార్తె ముగ్గురు బుధవారం ఉదయం క్వారీ చూసేందుకు వెళ్లారు . అక్కడ ప్రమాదవశాత్తు రాజు కుమార్తె గుంతలో పడిపోయింది. ఆమెను రక్షించబోయే క్రమంలో శ్రీపాల్ రెడ్డి, రాజు గుంతలోకి దిగారు. వారికి ఈ రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు.