మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

గడ్చిరోలి (CLiC2NEWS): మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం మావోయిస్టులకు , పోలీసులకు జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం మొదలైన కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయని పోలీసు అధికారులు వెల్లడించారు. చత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుండి 15 మంది మావోయిస్టులు ఉన్నట్ఉల సమాచారం అందడంతో డిప్యూటి ఎస్‌పి సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. మృతి చెందిన వారి వద్ద నుండి మూడు ఎకె-47 తుపాకీలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి.