శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్‌లు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

BCCI: మరికొన్ని రోజులలో భారత్ , శ్రీలంక జట్ల మధ్యా వన్డే, టి20 సిరీస్‌ల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టును బిసిసిఐ సెలక్షన్ కమిటి ప్రకటించింది. టి 20 జట్టుకు సూర్య కుమార్‌యాదవ్ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డే జట్టుకు రోహిత్ శర్మకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. కోచ్ గంభీర్ రిక్వెస్ట్ చేయడంతో సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ లంకతో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. హార్ధిక్ పాండ్య వ్యక్తి గత కారణాలతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ సారి జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
బిసిసిఐ ప్రకటించిన వన్డే, టి20 ల జట్ట వివరాలు
టి 20: సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్(వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్చర్ , శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా.