Budjet 2024: బిహార్‌, ఎపికి బ‌డ్జెట్‌లో పెద్ద పీట‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్రంలోని ఎన్డీయే స‌ర్కార్ ఈ సారి బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహారా ష్ట్రాల‌కు ప్రాధాన్యం క‌ల్పించారు. ఎన్డీయే స‌ర్కార్ ఏర్పాటులో కీల క పాత్ర పోషించిన తెలుగుదేశం+జ‌న‌సేన‌, జెడియుల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇచ్చార‌న‌డానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మంగ‌ళ‌వారం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ తెలుపుతోంది. ఈ రెండు రాష్ట్రాల‌కు త‌గిన ప్రాధ‌న్య‌త ఇచ్చారు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా బీహార్ కు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రం తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. కానీ బ‌డ్జెట్‌లో మాత్రం ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప‌లు ఆర్థిక ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించింది కేంద్రం.

దీనిలో భాగంగా లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ ప‌ద్దులు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో బిహార్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు.

బిహార్ అభివృద్ధి కోసం రూ. 26 వేట కోట్లు..

వెనుక‌బ‌డిన బిహార్ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. దానిలో భాగంగా మొత్తం రూ. 26 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ర‌హ‌దారుల అభివృద్ధి కోసం ఏకంగా 20 వేల కోట్ల‌ను కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పాట్నా-పుర్నియాల‌ను క‌లుపుతూ ఎక్స్ ప్రెస్ వే అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అలాగే బ‌క్స‌ర్ -భాగ‌ల్‌పూర్‌, బోథ్ గ‌యా – రాజ్‌గిర్ – వైశాలీ – ద‌ర్భంగాల‌ను అనుసంధానిస్తామ‌ని కేంద్రం తెలిపింది.

ఎపికి రూ. 15 వేట కోట్లు..

వివిధ ఏజెన్సీల ద్వారా అమ‌రావ‌తి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు మంత్రి పార్ల‌మెంటులో వెల్ల‌డించారు. అంతే కాకుండా ఎపి కి అవ‌సరాన్ని భ‌ట్టి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని అద‌న‌పు నిధులు కేటాయిస్తామ‌ని కూడా వెల్ల‌డించారు.

ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వ‌రం నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామ‌ని కేంద్ర‌మంత్రి తెలిపారు. భార‌త్‌లో ఆహార భ్ర‌ద‌త‌కు పోల‌వ‌రం ఎంతో కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. వీటితో పాటు ఎపిలోని వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్ర‌త్యేక ప్యాకేజీని అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌కాశం, ఉత్త‌రాంధ్ర‌తో పాటు రాయ‌ల‌సీమ అభివృద్ధికి ప్ర‌త్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయ‌నున్న‌ట్లు ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.