Budjet 2024: ఈ వ‌స్తువుల‌కు ధ‌ర‌లు త‌గ్గుతాయ్‌…!

న్యూఢిల్లీ (CLiC2NEWS): లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ ప‌ద్దులు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సారి బ‌డ్జెట్‌లో ప‌లు ర‌కాల వ‌స్తువుల‌కు క‌స్ట‌మ్స్ సుంకాన్ని భారీగా త‌గ్గించ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంటులో బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో ప‌లు ర‌కాల కేన్స‌ర్ ఔష‌ధాలు, మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నున్నాయి. కేంద్ర స‌ర్‌కార్ తీసుకున్న నిర్ణ‌యంతో బంగారం, లెద‌ర్‌, సీపుడ్ ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి.

కేంద్ర నిర్ణ‌యంతో ధ‌ర‌లు త‌గ్గే వ‌స్తువులు..
మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్ల‌పై బేసిక్ క‌స్ట‌మ్ సుంకాన్ని త‌గ్గించ‌డంతో వినియోగ‌దారుల‌కు స్మార్ట్ ఫోన్ల ద‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది.

కేన్స‌ర్ ఔష‌ధాలు..
కేన్స‌ర్ రోడుల‌కు కేంద్ర నిర్ణ‌యంతో ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. కేన్స‌ర్ చికిత్స‌కు వాడే ప‌లు ఔష‌ధాల‌పై క‌స్ట‌మ్స్ సుంకాన్ని కేంద్రం మిన‌హాయించింది. దీంతో వాటిపై ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌నున్నాయి.

బంగారం, వెండి..
బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌పై సుంకాన్ని 6 శాతానికి త‌గ్గించారు. ఈ నిర్ణ‌యంతో రిటైల్ డిమాండ్ పెరుగుతుంద‌ని, దాంతో స్మ‌గ్లింగ్ ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి.
అలాగే ప్లాటిన‌మ్ సుంకాన్ని 6.5శాతం క‌స్ట‌మ్స్ సుంకాన్ని త‌గ్గించారు.

సీ ఫుడ్‌..

రొయ్య‌లు, చేప‌ల మేత‌పై బేసిక్ క‌స్ట‌మ్స్ సుంకాన్ని 5 శానికి త‌గ్గించారు.

సోలార్ ఎన‌ర్జీ భాగాలు
సౌర విద్యుత్ సంబంధిత భాగాల‌పై సంకాన్ని పొడిగించకూడ‌ద‌ని కేంద్రం ప్ర‌తిపాదించింది.

ఫుట్‌వేర్‌పై కూడా క‌స్ట‌మ్స్ సుంకాన్ని త‌గ్గిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

ధ‌ర‌లు పెరిగే వ‌స్తువులు

టెలికాం ప‌రిక‌రాలు..
మ‌ద‌ర్ బోర్డుల‌పై 5 శాతం దిగుమ‌తి సుంకాన్ని పెంచాల‌ని కేంద్ర స‌ర్కానిర్ణ‌యించింది.
అలాగే దిగుమ‌తి చేసుకుని నైట్రేట్‌, నాన్ బ‌యోడీగ్రేడ‌బుల్ ప్లాస్టిక్‌పై క‌స్ట‌మ్ సుంకాన్ని 10 శాతానికి పెంచారు. దాంతో ఆయా వ‌స్తువుల ద‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.