విపక్ష నేత హోదాలో తొలిసారి శాసన సభకు హాజరైన కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి ఆయన హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సభకు రావడం ఇదే తొలిసారి. బడ్జెట్ సమావేశల నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.