506 కి. మీ. హైదరాబాద్ – బెంగళూరు కొత్త హైస్పీడు హైవే!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ – ఎపి – కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్యలను గట్టేక్కేందుకు మరో జాతీయ రహదారి అందుబాటులోకి తేవాలని కేంద్రం పూనుకుంది. హైదరాబాద్ – బెంగలూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుస హైవే ఉంది. అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖనిర్ణయించింది.
నాగ్‌పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. హైదరాబాద్ – బెంగళూరును కూడా అనుసంధానించాలని నిర్ణయించింది. దానికోసం డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) ను రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది కేంద్రం. ఈ మేరకు డిపిఆర్ తాయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందు కోసం జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లను ఆహ్వానించింది.