తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా జిష్ణుదేవ్ వ‌ర్మ‌

సిపి రాధాకృష్ణ‌న్ మ‌హారాష్ట్రకు.. ప‌లు రాష్ర్టాల‌కు గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కం

హైద‌రాబాద్ (CLiC2NDWS): తెలంగాణ రాష్ట్రానికి కొత్త‌గవ‌ర్న‌ర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్య‌మంత్రి జిష్ణుదేవ్ వ‌ర్మ (66) నియ‌మితులయ్యారు. కేంద్రా స‌ర్కార్ దేశంలోని ప‌ది రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న ర్‌ల‌ను నియ‌మించింది. ఇందులో ఏడుగురిని కొత్త‌గా నియ‌మించ‌గా, ముగ్గురిని ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు బ‌ద‌లీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉత్త‌ర్వులు జారీ చేశారు. జిష్ణుదేవ్ వ‌ర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్య‌క్తి, 1957 ఆగ‌స్టు 15న జ‌న్మించిన ఆయ‌న త్రిపుర రెండో డిప్యూటీ సిఎంగా ప‌నిచేశారు.

అలాగే జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా పనిచేస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న సిపి రాధాకృష్ణ‌న్‌ను మ‌హారాష్ట్రకు బ‌ద‌లిచేసింది కేంద్రం.

Leave A Reply

Your email address will not be published.