మరో రెండు రోజులు వర్షాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అంటే ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు 30 నుంచి 40 కి. మీ. వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.