తెరుచుకున్న శ్రీశైలం గేట్లు.. పర్యాటకుల సందడి

శ్రీశైలం (CLiC2NEWS): ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సోమవారం అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, శ్రీశైలం పూర్తిస్థాయినీటి నిల్వ సామర్థ్యం 215. 80 టిఎంసిలు కాగా. ప్రస్తుతం 179.89 టిఎంసిలు నీటి నిల్వ ఉంది. ఈక్రమంలో భారీ వరద నీరు వచ్చి చేరడంతో మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని వీక్షించేందుకు ప్రాజెక్టు వద్దకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు.