బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు.. 72 మంది మృతి
ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 72 మంద ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యామలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టి మద్దతుదారులు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం ఘర్షణ జరగగా అది హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 14 మంది భద్రతా సిబ్బంది, 13 మంది పోలీసులు కూడా మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుండి నిరవధిక కర్ఫ్యూ విధించింది.
రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం సందర్బంగా మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా .. చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కానీ ఆందోళనకారులు వాటిని తోసిపుచ్చి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా రావాలని కోరారు.