కెటిపిఎస్‌లో కనుమరుగైన 8 కూలింగ్ టవర్లు..
భద్రాద్రి కొత్తగూడెం (CLiC2NEWS): జిల్లా పాల్వంచ కెటిపిఎస్‌లో ఓ అండ్ ఎం కార్మాగారం లోని 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. కాలం చెల్లిన నేపథ్యంలో 2020 ఏప్రిల్ 11వ తేదీన ఈ కర్మాగారం మూతపడింది. కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినయోగం చేసుకోవడానికి ఈ టర్లను కూల్చివేతకు కెటిపిఎస్ నిర్ణయించింది. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసి కెటిపిఎస్‌కు ఉపయోగనించనున్నట్లు సమాచారం.
102 మీటర్ల ఎత్తు కలిగిన 8 కూలింగ్ టవర్లకు చారిత్రక ప్రస్తానం ఉంది. వీటి కూల్చివేతకు 2023 జనవరి 18 నుండి పనులు ప్రారంభమయ్యాయి. ట్రాన్స్‌కో తో పాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన అనంతరం ఈ ప్రక్రియ చేప్టారు. మొత్తం 30 మంది సిబ్బంది సుమారు నెల రోజుల పాటు శ్రమించారు. రాజస్థాన్‌లో జైపూర్‌నకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఈ ప్రక్రియ చేపట్టింది . మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియ జరిగింది. ముందుగా 102 మీటర్ల ఎత్తుగల 4 టవర్లు.. తర్వాత 115 మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను నేలమట్టం చేశారు.