బ‌లోపేత‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను గ‌త ప్ర‌భుత్వం ఆట‌బొమ్మ‌లుగా మార్చింది: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నామ‌ని ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్‌ల స‌ద‌స్సులో సిఎం చంద్ర‌బాబు, డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు మ‌నపై పెట్టుకున్న న‌మ్మ‌కానికి న్యాయం చేయాల‌న్నారు. బ‌లోపేత‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను  గ‌త ప్ర‌భుత్వ ఆట‌బొమ్మ‌ల‌లుగా మార్చింద‌ని.. వ్వ‌వ‌స్థ‌ల‌ను బ‌తికించాల‌నే ఉద్దేశంతోనే అన్నీ త‌ట్టుకొని నిల‌బ‌డ్డామ‌న్నారు. గ్రామ పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా ముంద‌డుగు వేస్తున్నామ‌ని , ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ గ్రామ‌స‌భ‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డ‌తామ‌ని ప‌వ‌న్ తెలియ‌జేశారు.

వెల‌పూడి స‌చివాల‌యంలో నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్‌ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి , ఉప ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధి ల‌క్ష్యంగా , అక్క‌డి ప్ర‌జ‌ల స్తితిగ‌తుల‌పై స‌మ‌గ్ర స‌ర్వే చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందుకు ఆయా ప్రాంతాల్లో ఆధార్‌, రేష‌న్ కార్డులు, నివాస గృహాలు, తాగునీటి వ‌స‌తులు , ర‌హ‌దారులు, వ్య‌వ‌సాయం స‌హా అన్ని వివారాల‌ను సేక‌రించాల‌ని నిర్ణ‌యించింది. దీని కోసం ప్ర‌త్యేక యాప్ రూపొందిస్తుంది. ఆగ‌స్టు 7 వ తేదీన స‌ర్వే ప్రారంభించిన 20వ తేదీలోపు ముగుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.