బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా..!
ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలతో ఆదివారం దాదాపు 100 మందికిపైగా మృతి చెందారు. ఇప్పటి వరకు 300 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా ప్రధానమంత్రి ఢాకా ప్యాలెస్‌ను వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. దేశంలో ఆందోళనలు ఉద్ధృతం కావడంతో పిఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. దేశంలో నెలకొన్న హింసాత్మక ఘటనల కారణంగా అక్కడ ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపినిచ్చి.. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త నెలకొన్న తరుణంలో ప్రధాని హసీనా, ఆమె సోదరి రెహనాలు ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగి.. నిరసనకారులు హింసామార్గాన్ని వీడాలని పిలుపినిచ్చారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం.