సైన్యం పాల‌న‌లో బంగ్లాదేశ్‌..

ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్ లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో దేశ ప్ర‌ధాని రాజీనామా చేసి , దేశం వీడి వెళ్లారు. ప్ర‌స్తుతం దేశం సైనిక పాల‌న‌లో ఉంది. సైనికాధిప‌తి జ‌న‌ర‌ల్ వ‌కార్‌-ఉజ్‌-జ‌మాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్ర‌భుత్వం ఏర్పాటైంది. ఆయ‌న ఏడాది జూన్ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా నియ‌మితుల‌య్యారు. నాలుగు ద‌శాబ్దాల పాటు మిలిట‌రీ విధులు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో ప్ర‌ధాన‌మంత్ఇర కార్యాల‌యం ఆధ్వ‌ర్యంఓల ఆర్మ్‌డ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిప‌ల్ స్టాఫ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. ఆర్మీని ఆధునికీక‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు గాను అత‌డి సేవ‌ల‌ను గుర్తించి, మూడేళ్ల ప‌ద‌వీకాలానికి గాను సైన్యాధిప‌తిగా దేశ ప్ర‌ధాని హ‌సీనా నియ‌మించారు. ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నెల‌రోజుల‌కే ప్ర‌ధాని గ‌ద్దె దిగాల్సిరావ‌డం గ‌మ‌నార్హం.

బంగ్లాదేశ్ ప్ర‌ధాని రాజీనామా..!

బంగ్లాదేశ్‌లో నెల‌కొన్న‌ ఉద్రిక్త‌త‌లు.. 72 మంది మృతి

Leave A Reply

Your email address will not be published.